![]() |
![]() |
.webp)
కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకొని వైరల్ అయిన ఓ జంటని నెటిజన్లు పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నలతో విసిగిస్తున్నారు. అదెవరో కాదు కీర్తిభట్. బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ కీర్తిభట్ ఎంగేజ్మెంట్ జరిగింది.
బిగ్ బాస్ సీజన్ సిక్స్ అంటే అందరికి గుర్తొచ్చే పేర్లు రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, గీతు రాయల్, ఆదిరెడ్డి, కీర్తిభట్, ఫైమా, అర్జున్ కళ్యాణ్.. ఇలా చెప్పుకుంటు పోతే పెద్ద లిస్టే అవుతుంది. హౌస్ లో ఉన్నప్పుడు కీర్తిభట్ చెప్పిన తన రియల్ లైఫ్ స్టోరీ ఎందరినో ప్రభావితం చేసింది. దాంతో కీర్తిభట్ ని ప్రేక్షకులు టాప్-5 లో ఉంచారు. అలా ఇరు రాష్ట్రాలలో తెలుగింటి ఆడపడచులా మారింది. ఇక ఆ తర్వాత మధురానగరిలో అనే సీరియల్ లో లీడ్ రోల్ చేసింది కీర్తిభట్. ఇక తన ప్రతీ విషయం ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోటోలతో, యూట్యూబ్ లో వ్లాగ్స్ తో తెలియజేస్తుంది. మొన్నటికి మొన్న కులుమనాలిలో షూటింగ్ కోసం వెళ్ళిన కీర్తిభట్ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ భామ.
ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. నైస్ హెయిర్ కట్ అక్క, చిన్న కుక్కపిల్లలాగా ఉన్నావని ఒకరు చెప్పగా.. థాంక్స్ అండ్ లవ్ యూ అని చెప్పింది కీర్తి. మ్యారేజ్ ఎప్పుడు అక్క అని ఒకరు అనగా.. టైమ్ ఉంది అంటు సమాధానమిచ్చింది. ఇక మరొకరు పెళ్ళి డేట్ చెప్పండి అక్క అని అడుగగా.. ఇద్ధరం ఒక కమిట్ మెంట్ పెట్టుకున్నాం. అది అయిపోగానే పెళ్ళి అని కీర్తిభట్ చెప్పింది. హాయ్ అక్క.. గ్రేట్ ఇన్సిపిరేషన్ ఫర్ మెనీ. హ్యాట్సాఫ్ లవ్ యూ అక్క అని ఒకరు చెప్పగా.. థాంక్ యూ సో మచ్ అని వీడియో చేసి చెప్పింది. బిగ్ బాస్ తర్వాత ఎవరినైన కలిసారా అనగా.. లేదని చెప్పింది. నిఖిల్ కావ్య గురించి చెప్పండి అని అనగా .. వాళ్ళు క్యూట్ కపుల్ అని అంది. అనాధాశ్రమమం పెట్టారా? బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చెప్పారు కదా అని ఒకరు అడుగగా.. చేసినవన్నీ చెప్పడానికి నాకు ఇష్టం ఉండదని కీర్తి రిప్లై ఇచ్చింది. ఏంటి ఈ మధ్య ఫ్రెండ్స్ ఎవరినీ కలవడం లేదు.. ఆరోహీ, వాసంతి? అని ఒకరు అడుగగా.. అందరు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో బిజీ అయిపోయారు కదా.. నేను కూడా బిజీ అయ్యాను. సీరియల్ షూటింగ్, ట్రావెలింగ్, సినిమా షూటింగ్ ఉంది. అందుకే టైమ్ లేదు. ఫ్రీగా ఉన్నప్పుడు అందరం మెసెజ్ చేసుకుంటామని కీర్తిభట్ అంది. మీ డాడ్ అండ్ మీరు ఎక్కువగా కలిసి ఉండే ప్లేస్ ఏంటి అని ఒకరు అడుగగా.. మంగళూరు అని రిప్లై ఇచ్చింది. ఇలా కొన్ని ప్రశ్నలకి సమాధానాలచ్చింది కీర్తిభట్.
![]() |
![]() |